17 June, 2026 | 8:46 PM

Breaking News

కామారెడ్డి జిల్లా ఒలంపిక్ డే రన్ 2026 చైర్మన్ గా డా.యం.జైపాల్ రెడ్డి   •   బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు   •   ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •  

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా

04-04-2026 03:03 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలంలోని అత్తాపూర్ సర్కిల్ వద్ద రోడ్డును ఆక్రమించిన నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఆరాంఘర్ నుంచి డెయిరీ ఫామ్ చౌరస్తా వరకు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు శనివారం కూల్చివేతలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ(GHMC) కొరడా ఝులిపించింది.  ఆరు జోన్లలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు, షెడ్లను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలిగించారు. జాంబాగ్, గోషామహల్ వద్ద ఆక్రమణల తొలగింపును జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్(GHMC CommissionerRV Karnan) పరిశీలించారు. సులభమైన ట్రాఫిక్ ప్రవాహాన్ని నిర్ధారించడానికి, ప్రజాప్రదేశాలను పరిరక్షించడానికి, జీహెచ్ఎంసీ ఈరోజు నగరవ్యాప్తంగా ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను చేపట్టిందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ డ్రైవ్‌ను సమర్థవంతంగా,  క్రమపద్ధతిలో అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.