calender_icon.png 21 February, 2026 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ వంతెన పనులు వెంటనే పూర్తి చేయాలి

21-02-2026 08:55:00 PM

జిల్లా రెవెన్యూ అధికారికి ఘట్ కేసర్ యువకులు వినతి

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే వంతెన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా రెవిన్యూ అధికారి  హరిప్రియను ఘట్ కేసర్ కు చెందిన యువకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా వంతెన నిర్మాణ పనులు పెండింగ్ లో ఉండటం చాలా బాధను కలిగిస్తోందన్నారు.

ప్రజలు ప్రతిరోజూ రవాణా సమస్యలు, ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాల భయంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగుల కష్టాలు వర్ణనాతీతం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనార్థం వంతెన నిర్మాణం విషయంలో పోరాటం చేస్తున్న యువతకు ఏరాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు.