30 August, 2026 | 5:00 AM

ఏష నాగుల కట్ట మీద..

30-08-2026 12:38 AM

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా యాక్షన్ ఎక్స్‌ట్రావ్యాగెంజా ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’, ఇటీవల విడుదలైన టీజర్‌తో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎకస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

‘ఆయా షేర్’కు వచ్చిన మంచి స్పందన తర్వాత మేకర్స్ ‘ఏష నాగుల’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జానపద బాణీకి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్ర హై-ఎనర్జీ మ్యూజిక్‌ను జోడించిన ఈ పాటను డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ కాన్సర్ట్ లైవ్‌గా విడుదల చేశారు. ఇప్పటికే పాపులర్ అయిన ఫోక్ నంబర్‌కు అనిరుధ్ మరింత గ్రాండ్, సినిమాటిక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ పాట మూడ్‌కు పర్ఫెక్టుగా సరిపోయాయి.

జంగిరెడ్డి వోకల్స్ పాటకు అథెంటిక్ రస్టిక్ టచ్‌ను అందించగా, ప్రభా తన వోకల్స్ పాటలోని ఎనర్జీని మరింత పెంచారు. ఈ డ్యాన్స్ పోర్షన్‌కు నాని, కీర్తి సురేశ్ కాంబో మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో మోహన్‌బాబు, కాయదు లోహర్, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 24న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ సహా ఎనిమిది భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి డీవోపీ: సీహెచ్ సాయి; ఎడిటింగ్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.