ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
మేడ్చల్, ఆగస్టు 29(విజయ క్రాంతి): ఎ స్సీ ఎస్టీలపై దాడులు జరగకుండా, వివక్ష, సామాజిక అణచివేత, వేధింపులకు గురికాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాల ని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నా రు. శనివారం తూముకుంట లో జరిగిన పౌ ర హక్కుల దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, సమాజంలోని ప్రతి ఒక్కరూ సమాన త్వం, సోదర భావం, సామాజిక న్యాయం వి లువలను పాటించాలన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్, రెవెన్యూ కార్యాలయం ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు వారి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా చట్టం ప్రకారం తక్షణమే స్పందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాంబాబు నాయక్, కీసర ఆర్డీవో వెంకట్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎస్ టి, ఎస్ సి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






