26 May, 2026 | 1:00 AM

సాగుకు సమాయత్తం

26-05-2026 12:00 AM
  1. రోహిణి కార్తె ప్రారంభం
  2. రైతుల ఎరువాక షురూ..
  3. వరిపైనే ఆసక్తి, పనుల్లో నిమగ్నమైన రైతులు
  4. జిల్లా వ్యాప్తంగా సాగుకు 5,22,308 ఎకరాలు సిద్ధం 

కోహెడ, మే 25 : రైతులు కోటి ఆశలతో వానాకాలం పంటల సాగుకు రైతులు సిద్దమయ్యారు. రోహిణి కార్తె (సోమవారం 25మే నుంచి ఆరంభం), జూన్ 8న ముగింపు కానుంది. ఈ కార్తెలో సాగు చేసిన పంటలు అధిక దిగుబడి వస్తుందని రైతులు విశ్వాసిస్తారు. బావులు, భోరుబావులలోని నీటితో వరి సాగుకు నారుమడులను సిద్దం చేస్తున్నారు. పత్తి, మొక్కజోన్న పంటల సాగుకు లోతైన దుక్కులను ట్రాక్టర్ల ద్వారా చదును చేస్తున్నారు. ఈ వానాకాలంలో వివిధ పంట సాగు వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం జిల్లా వ్యాప్తంగా సాగుకు 5,22,308 ఎకరాలు సిద్ధం చేస్తున్నారు.

వరిపైనే ఆసక్తి...

వరి పంటసాగు పైనే ఎక్కువ మంది రైతులు మక్కువ చూపుతున్నారు. పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగు పై కోతుల బెడద ఎక్కువ ఉండటంతో పంటల దిగుబడి రాకపోవడం ముఖ్య కారణంగా మారింది. వరి సాగులో ఎక్కువ పని భారం లేకపోవడంతో వరి సాగు పై రైతులు ఇష్టంగా ఉన్నారు. గత ఏడాది లాగే నైరుతి రుతుపవనాలతో ముందస్తుగానే రాష్ట్రంలో వర్షాలు విస్తరంగా కురుస్తాయని సంకల్పంతో సాగుకు నిమగ్నమైయారు. ప్రతి ఏటా వానాకాలం.. ప్రభుత్వం పంటలకు సైతం మద్దతు ధర క్వింటాలుకు రూ.50 పైన పెంచటంతో రైతులు చిరునవ్వు వ్యక్త పరుస్తున్నారు.

పంటల సాగుపై అవగాహన

వానాకాలం సాగు చేసే పంటల పట్ల వ్యవసాయ అధికారులు ముమ్మరంగా సదస్సులు ఏర్పాటు చేసి శాస్త్రవేత్తలతో అవగాహన కల్పిస్తున్నారు. పంటమార్పిడితో వచ్చె దిగుబడులు, సెంద్రీయ ఎరువుల వినియోగంతో కలిగే ప్రయోజనాల పై అవగాహన కల్పిస్తున్నారు. నకిలీ విత్తనాల విక్రయ నియంత్రణకు సైతం వ్యవసాయ, పోలీస్ శాఖలు సంయుక్తంగా తీవ్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మొత్తం వివిధ పంటల సాగు 5,22,308 ఎకరాలు వానాకాలం సాగు కానుంది. అలాగే జిల్లా వ్యాప్తంగా పంటల సాగుకు సరిపడ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను.. సిడ్స్, పర్టిలైజార్, పెస్టిసైడ్స్ షాపులలో వరి విత్తనాలు 85 వేలు క్వింటాళ్లు, పత్తి విత్తనాలు 2150 క్వింటాళ్లు, మొక్కజోన్న విత్తనాలు 2350 క్వింటాళ్లు, కందులు 25 క్వింటాళ్లు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. అలాగే యూరియ 52495 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 43746 మెట్రిక్ టన్నులు, డీఏపి 5833 మెట్రిక్స్ టన్నులు, పొటాష్ 2916 మెట్రిక్స్ టన్నులు సిద్దంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వానాకాలం ప్రణాళిక ఖరారు, ప్రధాన పంటల సాగు వివరాలు జిల్లా వ్యాప్తంగా..

పంట      సాగు (ఎకరాల్లో) 

వరి            3,33,202 

పత్తి             1,41,691

మొక్కజొన్న  28,939

కందులు        286

పెసర       18,190