100% ఇంటి పన్ను వసూలు చేయాలి
25-05-2026 10:07 PM
ఖానాపూర్ ఎం పి ఓ సిహెచ్ రత్నాకర్ రావు
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో 100% ఇంటి పన్ను వసూలు చేయాలని ఖానాపూర్ ఎంపీ ఓ సి హెచ్ రత్నాకర్ రావు అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిపన్ను ఏ గ్రామంలో కూడా బకాయిలు ఉండకూడదని, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన ముగించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో హౌసింగ్ ఏఈ తదితరులు పాల్గొన్నారు.






