24 June, 2026 | 6:31 PM

ఉషేగావ్ డీఆర్ డిపో, పెట్రోల్ బంక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జీసీసీ డీఎం సందీప్ కుమార్

24-06-2026 05:16 PM

జైనూర్, జూన్ 24 (విజయ క్రాంతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం ఉషేగావ్‌లోని నిత్యావసర వస్తువుల విక్రయ కేంద్రం (డీఆర్ డిపో)ను ఉట్నూర్ జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా డిపోలో బియ్యం, ఇతర సరకుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు అందిస్తున్న బియ్యం నిల్వల వివరాలు ఈ-పాస్ ఆన్‌లైన్‌లో సరిగా నమోదవుతున్నాయో లేదో సమీక్షించారు.అనంతరం జైనూర్ మండల కేంద్రంలో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌ను సందర్శించారు. ఇంధన విక్రయాల వివరాలను సేల్స్ మేనేజర్ విజయను అడిగి తెలుసుకున్నారు.డీఆర్ డిపో, పెట్రోల్ బంక్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు. నిత్యావసర వస్తువుల విక్రయాలను పెంచడంతో పాటు, ఆదివాసీ గిరిజనులు తీసుకువచ్చే ఇప్పపువ్వు, తేనె వంటి అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచాలని సూచించారు.