31 August, 2026 | 3:37 AM

గిరిజనగూడాల్లో గావ్ సాత్..

31-08-2026 01:15 AM

పొలిమేరు పోచమ్మ తల్లికి పూజలు

ఉట్నూర్, ఆగస్టు 30 : శ్రావణ మాసం లో వచ్చే పూర్ణిమ తర్వాత ఆదివాసి గిరిజను లు పొలిమేరు పోచమ్మ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆదివాసి గూడాలలోని ఆది వాసీ గిరిజనులు గావ్ సాత్ ( ఇంటింటి బ యట వంటలు ) కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆదివాసీ గ్రామంలోని ప్రతి ఇంటి నుండి పిల్లాపాపలతో కలిసి గ్రామ పొలిమేర వద్దకు వెళ్లి పోచమ్మ తల్లికి మొ క్కులు తీర్చుకుంటున్నారు. పొలిమేరలో అ క్కడే వంటలు చేసుకుని పిల్లాపాపలతో కలి సి వనభోజనం చేశారు.

ఆదివాసి గూడలోకి దుష్ట శక్తులు ఆవరించకుండా, ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన పంటలపై అడవి ప్రాణులు దా డి చేయకుండా కాపాడాలని ఆదివాసీ గిరిజనులు పోచమ్మ తల్లికి మొక్కుకున్నారు. ఉ ట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, ఉ ట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని ఆదివాసీ గిరిజనులు చాలా గ్రామాల్లో ఆదివారం పొలిమేర పోచమ్మ పూజలు నిర్వహించారు.