31 August, 2026 | 4:36 AM

రేషన్ బియ్యం కేసులో ఎస్సైకి చిక్కులు

31-08-2026 01:17 AM
  1. నిందితుల నుంచి డబ్బుల వసూళ్ల ఆరోపణలు
  2. సీజ్ చేసిన బియ్యం అమ్ముకున్నారన్న ఫిర్యాదు
  3. ప్రాథమిక విచారణలో కీలక అంశాలు.. వేటు తప్పదా?

ఆసిఫాబాద్ ,ఆగస్టు 30(విజయ క్రాంతి): కాగజ్నగర్ డివిజన్ పరిధిలో ఓ ఎస్సై వ్యవహారం పోలీసుశాఖలో కలకలం రేపుతోంది. అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు కేసు లో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఆఎస్సై మెడకు చుట్టుకున్నాయి.

అంతేకాకుండా కేసులో సీజ్ చేసి న రేషన్ బియ్యాన్ని సైతం అమ్ముకున్నారన్న ఫిర్యాదులు అధికారుల దృష్టికి వెళ్లినట్లు స మాచారం. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫి ర్యాదు అందడంతో ప్రాథమిక విచారణ చేపట్టగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చి నట్లు తెలుస్తోంది. దీంతో సదరు ఎస్సైపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధమైనట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆరోపణలు నిజమేనని తేలిందా?

ఓ పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి బియ్యాన్ని సీజ్ చేసినట్లు స మాచారం. అయితే ఈ కేసులో నిందితుల నుంచి ఎస్సై డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

సీజ్ చేసిన బియ్యాన్ని సై తం విక్రయించారన్న ఫిర్యాదు ఉండటంతో ఉన్నతాధికారులు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ వ్యవహారంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లినట్లు సమాచారం. ప్రాథమికంగా చేపట్టిన విచారణలో ఆరోపణలకు సంబంధించిన కొన్ని అంశాలు వాస్తవమేనని తేలినట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి చర్యలపై పోలీసుశాఖలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.

ఎస్సైపై అటాచ్మెంట్.. బదిలీ.. సస్పెన్షన్ ఎలాంటి చర్య ఉంటుందన్నదే చర్చ

సదరు ఎస్త్స్రపై ఎలాంటి చర్య తీసుకుంటారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. జిల్లా కేంద్రానికి అటాచ్ చేస్తారా? లేక సద రు పోలీస్స్టేషన్ నుంచి బదిలీ చేస్తారా? లేదా సస్పెన్షన్ వేటు వేస్తారా? అనేది తేలాల్సి ఉంది.సుమారు ఏడాదిగా ఆ స్టేషన్లో విధు లు నిర్వహిస్తున్న సదరు ఎస్సైపై రేషన్ బి య్యం కేసు వ్యవహారం తీవ్ర ప్రభావం చూ పినట్లు తెలుస్తోంది. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈసారి చర్యల నుంచి తప్పించుకోవడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి.

అధికార పార్టీ నేత ఫిర్యాదుతో మరింత వేడి...

మరోవైపు అధికార పార్టీలో ఉన్న ఓ నాయకుడే సదరు ఎస్త్స్ర వ్యవహారంపై పూర్తి ఆధారాలతో జిల్లా పోలీసు కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోకపోతే డీజీపీని కలు స్తానని సదరు నాయకుడు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా ఉన్నతాధికారులు ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.

తాజా పరిణామాలతో పోలీసుశాఖలో చర్చ....

కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో గతంలో నూ పలువురు ఎస్సైలు వివిధ ఆరోపణల నే పథ్యంలో సస్పెన్షన్, అటాచ్మెంట్కు గురైన ఘటనలు ఉన్నాయి. తాజాగా మరో ఎస్త్స్రపై చర్యలకు రంగం సిద్ధమవుతుందన్న వార్త పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారిం ది. డివిజన్లో మరో ఇద్దరు ఎన్హెచ్వోలపై కూ డా పలు కేసుల్లో అక్రమంగా వసూళ్లకు పా ల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలపై కూడా శాఖాపరంగా దృష్టి సారించినట్లు సమాచారం.