యువకుడి కిడ్నాప్‌కు యత్నం!
గ్రామస్తులు అడ్డుకోవడంతో పరారీ
బిజినపల్లిలో గంజాయి బ్యాచ్ హంగామా
నాగర్ కర్నూల్ ఆగస్టు 23 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామంలో శనివారం కొందరు యువకుల గుంపు మరో యువకుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాలెం గ్రామానికి చెందిన బాగానీ రాజు (18) సెంట్రింగ్ పని చేస్తున్న సమయంలో స్కార్పియో వాహనంలో వచ్చిన కొందరు యువకులు అతడిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జావేద్, నాని, బాబిలు అనే ముగ్గురు తనపై దాడికి యత్నించి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు అడ్డుకోవడంతో రాజును అక్కడే వదిలి పరారయ్యారు. యువకులు గంజాయి మత్తులో ఉన్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు బిజినేపల్లి ఎస్త్స్ర శంషాద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






