గంగూలీకి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం
Team Indiaకు కొత్త దిశ చూపిన 'దాదా'కు మరో అరుదైన గౌరవం.. ICC Hall of Fameలో చోటు దక్కిన గంగూలీ!
దుబాయి, జూలై 9 : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. ఈ దిగ్గజ సారథి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నా డు. తద్వారా ఈ అరుదైన గౌరవం దక్కిన 12వ భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో సచిన్, ద్రవిడ్, కుంబ్లే, ధోనీ, సెహ్వాగ్, కపిల్ దేవ్, గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, వినూ మన్కడ్, మహిళల విభాగం నుంచి డ యానా ఎడుల్జీ, నీతు డేవిడ్ ఎంపికయ్యారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌ను 2009లో ప్రారంభించారు.
భారత క్రికెట్‌కు 17 ఏళ్ల పాటు సే వలందించిన దాదా తన దూకుడుతో టీ మిండియా రూపురేఖలనే మార్చేశాడు. 2003 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరడం, 2004 లో పాక్‌పై టెస్ట్ సిరీస్ విజయం, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో టెస్ట్ సిరీస్‌లను డ్రా చేసుకోవడం వంటివి హైలెట్‌గా నిలిచాయి. గంగూ లీ 311 వన్డేల్లో 11,363 పరుగులు, 113 టెస్టుల్లో 7212 పరుగులు చేశాడు.
Sourav Gangulyకి ICC Hall of Fame ఎందుకు దక్కింది?
భారత క్రికెట్‌కు 17 ఏళ్ల పాటు విశేష సేవలందించిన Sourav Ganguly, విజయవంతమైన కెప్టెన్‌గా Team Indiaను కొత్త స్థాయికి తీసుకెళ్లారు. ఆయన సేవలకు గుర్తింపుగా ICC Hall of Fameలో చోటు కల్పించింది.
FAQ's
SOURAV GANGULYకి ఏ గౌరవం దక్కింది?
ICC Hall of Fameలో చోటు దక్కింది.
ICC HALL OF FAMEలో చోటు దక్కిన ఎన్ని మంది భారత క్రికెటర్లు ఉన్నారు?
గంగూలీతో కలిపి 12 మంది భారత క్రికెటర్లు ఈ గౌరవం పొందారు.
ICC HALL OF FAME అంటే ఏమిటి?
క్రికెట్‌కు విశేష సేవలందించిన దిగ్గజ ఆటగాళ్లను ICC Hall of Fameలో చేర్చి సత్కరిస్తుంది.
ALSO READ....
పాక్ క్రికెటర్ సల్మాన్ అఘాకు ఐసీసీ షాక్
అర్షదీప్ సింగ్‌కు ఐసీసీ షాక్.. మ్యాచ్ ఫీజులో 15% జరిమానా
బంగ్లా, పాక్‌లకు జైషా చురక — ఏ జట్టూ సంస్థ కంటే పెద్దది కాదు!






