calender_icon.png 17 February, 2026 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగిశెట్టి శ్రీనివాస్ సేవలు ఆభినందనీయం

16-02-2026 12:00:23 AM

అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ

ములుగు,ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పు రస్కరించుకుని రామప్ప దేవాలయం లో భ క్తుల సౌకర్యార్థం ఉచిత శుద్ధి చే యబడిన త్రాగునీటి కేంద్రాన్ని ములు గు అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ ప్రారంభించారు. ఈ నీటి కేంద్రాన్ని కీ.శే. గంగిశెట్టి సరస్వతి జ్ఞాపకార్థం వారి కుమా రుడు గంగిశెట్టి శ్రీనివాస్ దాతగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. గత పదిహేను సంవత్సరాలుగా రామప్పలో భక్తులకు ఉచిత త్రాగునీరు అందించడం గంగిశెట్టి శ్రీనివాస్ కుటుంబం సమాజ సేవా భావనకు నిదర్శనమని ప్రశంసించారు.

మహాశివరాత్రి వంటి భారీ ఉత్సవాల సమయంలో వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని, వారికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ తహసీల్దార్ గిరిబాబు, రామప్ప ఆలయ కమిటీ చైర్మన్ మిల్కూరి ఐలయ్య, ఈఓ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, ములుగు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.