16-02-2026 12:00:00 AM
మహబూబాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్న కల్ నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో రెండిట్లో కాంగ్రెస్ అభ్యర్థులను చైర్మన్లుగా గెలుచుకోవడానికి పూర్తి మెజార్టీ స్థాయిలో కౌన్సిలర్లను గెలిపించి క్లీన్ స్వీప్ చేసేందుకు మీరు చేసిన కృషి అభినందనీయం..
కంగ్రా ట్స్ డాక్టర్ సాబ్ అంటూ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ ను సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి అభినందించారు. డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ కు వేం నరేందర్ రెడ్డి శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.