ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మీడియా కమిటీ
వైస్ చైర్మన్‌గా గజవాడ నాగరాజు
భిక్కనూరు, జూన్ 19 (విజయక్రాంతి): భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన సాక్షి విలేఖరి గజవాడ నాగరాజును తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మీడియా కమిటీ వైస్ చైర్మన్‌గా రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ నియమించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సమాజంలో ఆర్యవైశ్యులకు గుర్తింపు ఉన్నప్పటికీ సంఖ్యాపరంగా, రాజకీయంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం కైలాస్ శ్రీనివాసరావు, తెలంగాణ రీజినల్ చైర్మన్ శెనిశెట్టి గౌరీశంకర్‌లను శాలువాలతో సత్కరించారు.
ఆర్యవైశ్య యువజన సంఘం ప్రధాన కార్యదర్శి చల్ల లక్ష్మణ్, కోశాధికారి కొడిప్యాక వెంకటేశం, ఉపాధ్యక్షులు శెనిశెట్టి శ్రీనివాస్, అతిమాముల రమేష్ గుప్తా, శ్రీరామ్ వెంకటేష్, గంగెల్లి మధుసూదన్, పబ్బ నాగరాజు, గూడెపు సిద్ధగిరి, గంజి శ్రీనివాస్, బొందుగుల రవీందర్, ధన్నారపు శ్రీరామ్, గంగెల్లి శివకుమార్, కొడిప్యాక అంజయ్య, చీకోటి నాగభూషణం, అల్లాడి రమేష్, ధన్నారపు రామకృష్ణ, ధన్నారపు శ్రీనివాస్, గంగెల్లి జగదీశ్వర్, బొందుగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






