19 June, 2026 | 10:56 AM

Breaking News

ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్‌.. ఇంకా వీడని మిస్టరీ   •   అగ్రహారంలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య   •   పేరుకే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం   •   సింగరేణిలో ఐదో రోజు కవిత బాయిబాట కార్యక్రమం   •   నల్గొండలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి   •   పుడమి తల్లి గర్భంలోనే పాడై పోతున్న అంకురం   •   దమ్ముంటే కేసీఆర్‌ ను టచ్ చేసి చూడు..!   •   నియోజకవర్గ రిపోర్టర్లకు జిల్లా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి   •   అక్రమ మొరం తవ్వకాలపై పోలీసుల దాడి.. ట్రాక్టర్, జేసీబీ స్వాధీనం   •   మధిరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బీఎల్ఓ లకు శిక్షణ   •  

పుడమి తల్లి గర్భంలోనే పాడై పోతున్న అంకురం

19-06-2026 09:40 AM

వరునుడి  కరుణ లేఖ రైతన్న దిగాలు.

మొలిచిన మొక్కను కాపాడేందుకు స్ప్రింక్లర్ లా ఏర్పాటు .

బోథ్ జూన్ 19(విజయక్రాంతి): ప్రతి ఏడాది మృగశిర కార్తె తోనే వర్షాలు కురవడం ఆ వెంటనే రైతులు విత్తనాలు నాటడం జరుగుతున్నది. అయితే ఈ ఏడాది మాత్రం ఎల్ ని నో ప్రభావం ముందస్తుగా వాతావరణ శాఖ నిపుణులు శాస్త్రవేత్తలు పేర్కొన్న విధంగానే వరుడు కరుణించడం లేదు. దీంతో మొదటి వర్షానికి విత్తనాలు నాటిన రైతులు దిగాలు చెందుతున్నారు

జిల్లాలో 5 లక్షల 90 వేల ఎకరాలలో పంటల సాగు

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల 90 వేల ఎకరాలలో పత్తి సోయాబీన్ కంది మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఎల్ ని నో ప్రభావం ఉంటుందని భావించిన రైతులు పత్తి పంట సాగుపై దృష్టి సారించారు. దాదాపు ఏడాది మూడు లక్షల 50 వేల ఎకరాలలో పత్తి పంటను సాగు చేస్తారని అధికారులు అంచనాకు వచ్చారు అంతేగాక 78 వేల ఎకరాలరు సోయా పంట సాగు చేయవచ్చని నిర్ధారించారు కంది పంట 45000 ఎకరాల్లో సాగుకు నోచుకుంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు.

పుడమి తల్లి గర్భంలో

జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మొదటి వర్షాలు అధికంగా కురవడంతో రైతులు ఉత్సాహంగా పత్తి పంట విత్తనాలను నాటారు. దాదాపు రెండు లక్షల ఎకరాల్లో రైతులు విత్తనాలు నాటి ఉంటారని అధికారులు అంచనాకు వస్తున్నారు. ఆదిలాబాద్ తాంసి తలమడుగు భీంపూర్ గుడిహత్నూర్ బజార్హత్నూర్ సోనాల మండలాల్లో అధిక శాతం రైతులు పత్తి విత్తనాలు నాటారు. మిగతా మండలాల్లో అక్కడక్కడ వర్షం కురిసిన దాన్నిబట్టి పంట వేయడం జరిగింది. మొదట మురిపించిన వర్షం వల్ల విత్తనాలు నాటడం ఆ తర్వాత చినుకు రాలకపోవడంతో వేలాది ఎకరాల పుడమి తల్లి గర్భంలో ఉన్న (అంకురం) విత్తనాలు మురిగి చెడి పోతున్నాయి. దీంతో కోట్లాది రూపాయల పెట్టుబడి మొదట్లోనే నేల పాలైనట్లు అయింది.

తుం పరి సేద్యంతో మొలిచిన మొక్కకు నీరు

కొన్ని మండలాల్లో పత్తి విత్తనాలు అక్కడక్కడ మొలకెత్తాయి దీంతో నీటి వసతి ఉన్న రైతులు స్పింకులర్ లద్వారా నీటి వసతి కల్పిస్తున్నారు. దీంతో ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటాయోనని రైతులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు రైతులను మరింత అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది