calender_icon.png 24 February, 2026 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణాభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు

24-02-2026 12:37:52 AM

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్‌నగర్, ఫిబ్రవరి 23( విజయక్రాంతి): ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం రూ. 10 కోట్ల భారీ నిధులను మంజూరు చేసినట్లు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెల్లడించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో  అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను ప్రకటించారు.

నియోజకవర్గంకు మంజూరైన నిధులను తాగునీటి సమస్యలు, పాఠశాలల మరమ్మత్తులు, కాలువలు, సీసీ రోడ్లు, వంతెనల నిర్మాణం మరియు ప్రభుత్వ భవనాల కోసం కేటాయించినట్లు చెప్పరు.ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ, అభివృద్ధిలో రాజకీయాలు చూడబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బీజేపీ కౌన్సిలర్ ప్యాట అశోక్ కోరగానే వార్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు ఆయన ఉదహరించారు. మున్సిపాలిటీలో కూడా త్వరలోనే వార్డుల వారీగా అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

నిధుల కేటాయింపు వివరాలు మండలాల వారీగా ఇలా ఉన్నాయి.

ఫరూక్ నగర్ మండలం లో పంచాయతీ భవనం, సీసీ రోడ్లు రూ. 39 లక్షలు, కొత్తూరు మండలం లో నిఇనుములనర్వ  పంచాయతీ భవనం, సీసీ రోడ్లు రూ. 39 లక్షలు కొందుర్గు మండలం లో ని రేగడి చిలకమర్రి రహదారుల నిర్మాణం రూ. 3.65 కోట్లు,నందిగామ మండలంలో మరమ్మత్తులు రూ. 45 లక్షలు,వీర్లపల్లి కమ్యూనిటీ భవనం & బీటీ రోడ్డు రూ. 4.65 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.రాబోయే సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయాలని, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించాలని ఎమ్మెల్యే కోరారు.  కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగనూరు బస్వం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్ పాల్గొన్నారు.