పాఠశాల పెండింగ్ భౌతిక వనరుల కల్పనకు నిధులు మంజూరు
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
కోదాడ, జూలై 28 : కోదాడ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో పెండింగ్ పనుల పూర్తికి 30 లక్షలు అనుమతి మంజూరు చేస్తునట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం కోదాడ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు, బెస్ట్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కోదాడ యందు పెండింగ్ పనులను 90 రోజుల్లో పూర్తి చేయాలని ఏఈ ఓబులేష్ ను కలెక్టర్ ఆదేశించారు.
పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. ఎఫ్ ఏ 1 ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న తీరు, సిలబస్, గురించి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరం కష్టపడి చదివి, జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. అనంతరం కోదాడ ఏరియా అసూపత్రిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కోదాడ 100 పడకల ఆసుపత్రిని నాణ్యతతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
నాణ్యతా ప్రమాణాలలో రాజీ పడొద్దని నాణ్యతలో ఏమైనా తేడాలు ఉంటే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగులకు ఇబ్బంది కలగకుండా మెట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాల న్నారు. ఆస్పత్రికి సరిపడా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా అన్నారు. కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ గారు, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆస్పత్రి సూపర్డెంట్ దశరథ నాయక్, తహసిల్దార్ సంతోష్ కిరణ్ , డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






