05-02-2026 01:35:01 PM
ఆరు మండలాల్లో 84 భవనాల మంజూరు
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల : నియోజకవర్గంలో మహిళా సంఘాలకు చెందిన 84 గ్రామైక్య సంఘాల (వీఓలు)కు రూ.8.40 కోట్ల వ్యయంతో సొంత భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(Jadcherla MLA Janampalli Anirudh Reddy) వెల్లడించారు. ఆరు మండలాల్లో ఈ భవనాల నిర్మాణం మంజూరైయిందని గురువారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒక్కొక్కటి రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించే వీఓ భవనాల్లో ఊర్కొండ మండలానికి 16, మిడ్జిల్ మండలానికి 5, రాజాపూర్ మండలానికి 8, బాలానగర్ మండలానికి 17, జడ్చర్ల మండలానికి 14, నవాబుపేట మండలానికి 24 చొప్పున మంజూరు అయ్యాయని చెప్పారు.
ఊర్కొండ మండలంలోని బొమ్మరాసుపల్లి, గుడిగానిపల్లి, గండ్లగుంటపల్లి, ఇప్పలపాడు, జగబోయినపల్లి, జకినాలపల్లి, లోక్యాతాండా, మాచారంపల్లి, మాదారం, నర్సంపల్లి, రాచాలపల్లి, రన్ రెడ్డిపల్లి, రేవల్లి, తిమ్మన్ పల్లి, ఊర్కొండ, ఊర్కొండపేట, మిడ్జిల్ మండలంలోని మసిగుండ్లపల్లి, ఈదులబాయి తాండ, బోయిన్ పల్లి, వేముల, మిడ్జిల్ గ్రామాల్లో విఓ భవనాలు మంజూరు అయ్యాయని తెలిపారు. అలాగే బాలానగర్ మండలంలోని హేమాజీపూర్, గాంధీపాలెం, గంగాధరపల్లి, మోతీఘనపూర్, నేరెళ్లపల్లి, కేతిరెడ్డిపల్లి, గాలిగూడ, చింతకుంట తాండ, పెద్దాయిపల్లి, మాచారం, మోదంపల్లి, వీరన్నపల్లి, సూరారం, గుండేడ్, గౌతాపూర్, ఉడిత్యాల, చిన్నరేవల్లి గ్రామాల్లో విఓ భవనాలు మంజూరయ్యాయని చెప్పారు.
జడ్చర్ల మండలంలోని ఆలూరు, అమ్మపల్లి కాలనీ, బండమీదిపల్లి, చిన్న ఆదిరాల, గొల్లపల్లి, గోప్లాపూర్, కిష్టంపల్లి, మాచారం, మల్లెబోయిన్ పల్లి, నెక్కొండ, పెద్దపల్లి, లింగంపేట్, కిష్టారం, కొత్త తాండా గ్రామాలకు కూడా విఓ భవనాలు మంజూరు అయ్యాయని వెల్లడించారు. నవాబుపేట మండలంలోని చౌడూరు, పల్లెగడ్డ, కొండాపూర్, యన్మన్ గండ్ల, కామారం, దొడ్డిపల్లి, దర్పల్లి, గురుకుంట, దయాపంతుల పల్లి, అమ్మాపూర్, దేపల్లి, కారూర్, రుద్రారం, కొల్లూర్, హాజీపూర్, కాకర్జాల, కేశవరావుపల్లి, హనుమన్సాని పల్లి, తిమ్మాయిపల్లి, కాకర్లపాడు, సిద్ధోటం, కిషన్ గూడ, ఊరంచుతాండ గ్రామాలకు కూడా విఓ భవనాలు మంజూరు కావడం జరిగిందని అనిరుధ్ రెడ్డి వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ మహిళా సంఘాలు క్రియాశీలకంగా పని చేస్తున్న ప్రాంతాల్లో భవనాలు కట్టడానికి భూమి అందుబాటులో ఉంటే విఓ భవనాలను నిర్మించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 84 విఓ భవనాలను రూ.8.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారని తెలిపారు. ఈ భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.