మా డిమాండ్లను నెరవేర్చండి
- పరిష్కారమైతేనే ఆందోళలను విరమిస్తాం
- విద్యుత్ కార్మికులు నాలుగో రోజుకి చేరిన సమ్మె
- రోజురోజుకు పెరుగుతున్న మద్దతు
మహబూబాబాద్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): ఉద్యోగ భద్రత, సర్వీస్ రెగ్యులర్‌లో ఏకీకృత విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న విద్యుత్ కార్మికుల సమ్మె శనివారం నాలుగో రోజు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థల సర్కి ల్, డివిజన్ కేంద్రాలతో పాటు జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయాల వద్ద విద్యుత్ కార్మికులు నిరసన దీక్షలు కొనసాగించారు.
ఆర్టిజన్, అన్ మ్యాన్, స్పాట్ బిల్లర్స్, పీస్ రేట్ విద్యుత్ కార్మికులు నిరసన దీక్షలో పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడానికి ప్ర భుత్వం, విద్యుత్ సంస్థల యాజమా న్యం తక్షణం చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్ష శిబిరంలో జాక్ తొర్రూర్ డివిజన్ కన్వీనర్ బంధారపు శ్రీను,కో చైర్మెన్ పండు నాగరాజు, కో కన్వీనర్ మంకాళి రమేష్ మాట్లాడుతూ విద్యార్హతల ఆధారంగా ఉద్యోగులు కన్వర్షన్ చేయాలని, ఆర్టిజన్లకు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అమ లు చేయాలని, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్‌లలో అన్ మ్యాన్డ్ వర్కర్ల కు ఆర్టిజన్లగా విలీనం చేయాలన్నారు.
2016 కంటే ముందు ఉన్న అర్హతను బట్టి పనిచేస్తు ఇప్పటికీ ఔట్‌సోర్సింగ్ కాంటాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్‌గా గుర్తించాలని, విద్యు త్ సంస్థలో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం చెల్లించాలన్నారు.2026 పీఆర్‌సీ వేతన సవరణ అమలు చేయాల ని, డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశా రు.
కార్యక్రమంలో సునీల్, పుల్లయ్య, ఖాజాబీ, ఎర్రం కుమార్, వెంకన్న, జ్యో తి, సురేష్, శ్రీధర్ బాబు, రవీందర్, రాజు, రాఘవయ్య, యాకన్న, శుభాష్, వేణు, రామకృష్ణ పాల్గొన్నారు. విద్యు త్ కార్మికుల సమ్మెకు వివిధ పక్షాల మద్దతు రోజురోజుకు పెరుగుతోంది.




