21 August, 2026 | 6:29 PM

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

21-08-2026 05:29 PM

సుల్తానాబాద్, ఆగస్టు 21 (విజయ క్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలో బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలతో కలిసి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు గొట్టిముక్కుల సురేష్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.