21 August, 2026 | 7:05 PM

క్రీడాకారులకు క్రీడా పరికరాలు అందజేత

21-08-2026 05:51 PM

నాగిరెడ్డిపేట్, ఆగస్టు 21 (విజయ క్రాంతి): మండలంలోని జప్తి జాన్కంపల్లి గ్రామ క్రీడాకారులు, యువకులు వాలీబాల్ నెట్టు కావాలని గ్రామ సర్పంచ్ వర్షిని పరమేశ్వరుని కోరడం జరిగింది. దీనితో క్రీడాకారుల కోరిక మేరకు గ్రామ సర్పంచ్ వర్షిని పరమేశ్వర్ వాలీబాల్ నెట్టు క్రీడాకారులకు అందజేశారు. మరియు జప్తి జాన్కంపల్లి గ్రామానికి చెందిన జోడు భారతికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పనుల కొరకు గ్రామ సర్పంచ్ వర్షిని పరమేశ్వర్ ముగ్గుపోసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వర్షం పరమేశ్వరి మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందని, పేద ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ పాటుపడుతుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని అర్హులైన పేదలకు కచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు వస్తాయన్నారు.అలాగే గ్రామ క్రీడాకారులు యువకులు క్రీడల్లో ముందుండి తమ అనుకున్న లక్ష్యాన్ని ఎంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వర్షిని పరమేశ్వర్, పంచాయతీ కార్యదర్శి శంకర్,వార్డుమెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.