7 March, 2026 | 6:19 AM

వైఫల్యాల నుంచి.. డైవర్షన్ డ్రామా!

07-03-2026 01:25 AM
  1. 800 రోజుల్లో చేసిందేమీలేక 99 రోజుల ప్రణాళిక
  2. యాక్షన్ ప్లాన్ ఉత్తి దండగ ప్రచార పర్వం
  3. కాంగ్రెస్ అధిష్ఠానానికి ఏటీఎంలా తెలంగాణ ఖజానా 
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి) : రాష్ట్రంలో అధికారం చేప ట్టి 800 రోజుల పాలనలో చేసిం దేం లేక, 99 రోజుల ప్రణాళిక పేరి ట మరో డ్రామాకు సీఎం రేవంత్‌రెడ్డి తెర లేపారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రెండున్నరేండ్ల పాలన తర్వాత ప్రగతి ప్రణాళికలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. ‘ప్రజా పాలన- ప్రణాళిక’ పేరి ట రేవంత్ సర్కారు చేస్తున్న 99రోజుల ప్రచార ఆర్భాటంపై శుక్రవారం ట్వి ట్టర్ వేదికగా హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

యాక్షన్ ప్లాన్ పేరిట పాలనా వైఫల్యం నుంచి దృష్టి మరల్చేందుకు డైవర్షన్ ప్లాన్ డ్రామాకు తెర తీశారంటూ ధ్వజమెత్తారు. ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ కేవలం ఉత్తి దండగ ప్రచార పర్వం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. అమలుకు నోచుకోని ఆరు గ్యారెంటీలు, పాలన వైఫల్యాలు, కోట్లు కొల్లగొట్టేందుకు చేసిన స్కాంలు, ప్రజల ఛీత్కారాల నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరో డైవర్షన్ ప్లాన్ ఇది అని తెలిపారు.

తంలో రెండుసార్లు నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో ప్రజల నుంచి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు పరిష్కారం కాక ఇంకా చెత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్లలో అసలు ఏం చేసారని ప్రచారం నిర్వహిస్తున్నారని, గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి మీ వైఫల్యాలు చెప్పుకుంటారా అని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుద్ధ్య, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ అనేది ప్రభుత్వ కనీస బాధ్యత కానీ, దానికి కూడా ఒక ఈవెంట్ లాగా కలర్ ఇవ్వడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు. మీ పాలనలో సగం కాలం పూర్తి కావొస్తున్నదని, ఇంకా ఎన్ని రోజులు ఇలా ప్రచారాలతో ప్రజలను మభ్య పెడతారని ప్రశ్నించారు. 

ప్రకటనల పేరిట తెలంగాణ ప్రజల ధనం వృథా..

ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకీ మోత అన్నట్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని, ఇక్కడి సొమ్ముతో కేరళలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ఆర్భాటం చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని కల్లబొల్లి మాటలు చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. పక్క రాష్ట్రమైన కేరళలో మాత్రం రూ. వందల కోట్లతో తెలంగాణ ప్రజాధనాన్ని మంచి నీళ్లలా పారబోస్తున్నారని మండిపడ్డారు.

కేరళ ఎన్నికల కోసం అక్కడి మలయాళ పత్రికల్లో సీఎం, డిప్యూటీ సీ ఎంల ఫొటోలతో ఇస్తున్న ఫుల్ పేజీ యాడ్స్ చూస్తుం టే.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఖజానా ఒక ఏటీఎంలా మారిందని అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. బడి పిల్లలకు కనీస వసతులు లేవు కానీ..సీఎం అమెరికా టూర్లకు, ఆయన విమాన ఖర్చులకు మాత్రం విద్యాశాఖ ఖాతాల్లోంచి కోట్లు మళ్లించుకుంటారని, ఇక్కడ యువత భవిష్యత్తును అంధకారం చేసి..

కేరళలో మాత్రం తెలంగాణలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు సృష్టించా మ ని పచ్చి అబద్ధాలతో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇక్కడి డబ్బును తీసుకెళ్లి కేరళ మలయాళ పత్రికల్లో తెలంగాణలో సంక్షేమ పండుగ అని అబద్ధపు యాడ్స్ ఇచ్చుకోవడానికి చేతులు ఎలా వచ్చాయని ప్ర శ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్‌ను చెల్లించడం చేతగాని ప్రభుత్వం కేరళలో మాత్రం తమది అద్భుత పాలన అని పబ్లిసిటీ చేసుకుంటుందని ఎద్దేవా చేశారు.