మల్లయ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన స్నేహితులు
20-08-2026 01:19 PM
తుంగతుర్తి,(విజయ క్రాంతి): తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన పొన్నం మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు మల్లయ్య పెద్ద కుమారుడి 10వ తరగతి స్నేహితులు ముందుకు వచ్చారు. తమ స్నేహబంధాన్ని చాటుకుంటూ మిత్రులంతా కలిసి రూ.13,000 ఆర్థిక సహాయాన్ని మల్లయ్య కుటుంబ సభ్యులకు గురువారం అందజేశారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితుల ఔదార్యాన్ని, గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.






