ప్రతి పౌరునికి స్వేచ్ఛ, సమానత్వం రాజ్యాంగం కల్పించిన హక్కు
నల్సార్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ హారతి వగేషన్
ముషీరాబాద్, ఏప్రిల్ 14(విజయక్రాంతి): రాజ్యాంగం ప్రతి భారత పౌరునికి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం ప్రసాదించిందని నల్సార్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హారతి వగేషన్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని భారతీయ జీవిత బీమా సంస్థలోని అతిపెద్ద యూనియన్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ గాంధీనగర్లోని ప్రధాన కార్యాలయంలో ‘రాజ్యాంగ విలువలు - ప్రస్తుత పరిస్థితులు’ అనే అంశంపై ఉద్యోగులు సెమినార్ ను నిర్వహించారు.
నల్సార్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హారతి వగేషన్ ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. ఈ సెమినార్‌కు సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. గుణశేఖర్, డిఎస్. రఘు, కార్యవర్గ సభ్యులు మహమ్మద్ జావేద్, నవీన్ బాబు, కత్తి బిక్షపతి తదితరులు పెద్ద ఎత్తున హాజరైయ్యారు.






