21 March, 2026 | 7:45 PM

వడ్యాల్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

21-03-2026 05:10 PM

లక్ష్మణ చందా,(విజయక్రాంతి): హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రి అయినా కిమ్స్ సన్ షైన్ డాక్టర్ విమలాకర్ రెడ్డి టీం ఆధ్వర్యంలో మండలంలోని వడ్యల్ గ్రామంలో మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన వారికి క్యాన్సర్, గ్యాస్ ట్రబుల్ సంబంధించిన వ్యాధుల పట్ల పూర్తి స్క్రీనింగ్ టెస్ట్ లు చేశారు.

ఈ క్యాంపుకు విశేష స్పందన వచ్చింది. డాక్టర్ విమలాకర్ రెడ్డి మాట్లాడుతూ... ఇక్కడ నిర్వహిస్తున్న ఈ క్యాంపు 39వ క్యాంపుగా ఇది తన సొంత గ్రామంలో నిర్వహించుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ క్యాంపులో గ్రామ యువకులు చుట్టూ పక్క గ్రామాల యువత వచ్చి సేవలు అందించారు.