5 July, 2026 | 1:45 AM

రూ.30 లక్షలతో స్కూల్ భవనం

05-07-2026 12:06 AM
  1. అల్లందేవి చెరువులో నాలుగు గదులతో నిర్మాణం
  2. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఈఎల్వీ భాస్కర్
  3. ప్రభుత్వ బడుల బలోపేతానికి వెనుకాడేది లేదని స్పష్టీకరణ

సంస్థాన్ నారాయణపూర్, జూలై 4(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపూర్ మం డలం అల్లందేవిచెరువు గ్రామంలో 30 లక్ష ల వ్యయంతో నాలుగు గదుల ప్రభుత్వ పా ఠశాల భవనాన్ని ఇఎల్వి ఫౌండేషన్ అధినేత ఇరుగుదిండ్ల భాస్కర్ నిర్మించి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటా రని వారి సారథ్యంలో పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు.

ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతానని అన్నారు. విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపుని చ్చారు. రూ.30 లక్షల వ్యయంతో 200 మంది చదువుకునేలా పాఠశాల భవనాన్ని నిర్మించినట్టు తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని కో రారు. సర్పంచ్ సుర్వి సౌజన్యరాజుగౌడ్ మా ట్లాడుతూ అడిగిన వెంటనే పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాల భవనాన్ని నిర్మించి ఇచ్చిన భాస్కర్‌కు గ్రామస్తుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన తమ బాధ్యత అని అన్నారు. లక్షల ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లకు పంపకుండా వాటికి ధీటుగా గ్రామాల్లోని పాఠశాలను తీర్చి దిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈ వో గోలి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు కనకసేన, కార్యదర్శి నరేష్, ఉపసర్పంచ్ ము క్క్యర్ల కవిత స్వామియాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు,విద్యార్థులు,గ్రామస్తులు, ఇఎల్వి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.