25 July, 2026 | 2:58 AM

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం

25-07-2026 12:38 AM
  1. యూకే, యూరప్ దేశాల్లో ఉద్యోగాలంటూ రూ.కోట్లలో వసూలు 
  2. తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది బాధితులు
  3. ‘ఫ్లయింగ్ బోర్డర్స్’ నిర్వాహకులపై హెచ్‌సీసీఎస్‌లో ఫిర్యాదు

రంగారెడ్డి/సికింద్రాబాద్, జూలై 24 (విజయక్రాంతి): విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పి స్తామంటూ వేలాది మంది నిరుద్యోగులను మోసగించిన ‘ఫ్లయింగ్ బోర్డర్స్’  కన్సల్టెన్సీ లీలలు వెలుగులోకి వచ్చాయి. యూకే, యూరప్ దేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి తెలుగు రాష్ట్రాల్లోని అభ్య ర్థుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సంస్థపై బాధితులు శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‌లోని బేగంపేట ప్రధాన కేం ద్రంగా, ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో ఈ సంస్థ కార్యాలయాలు ఏర్పాటు చేసి నిరుద్యోగులను ఆకట్టుకుంది. యూకే, వివిధ యూరప్ దేశాల్లో వర్క్ పర్మిట్లు, ఆకర్షణీయమైన జీతాలతో ఉద్యోగాలు ఇప్పి స్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ. 3 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు సంస్థ నిర్వాహకులు  వసూలు చేశారు.

బోర్డు తిప్పేసిన సంస్థ

డబ్బులు కట్టి నెలలు గడుస్తున్నా వీసాలు, ఉద్యోగ ఆఫర్ లెటర్లు రాకపోగా, సంస్థ నిర్వాహకులు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. అనుమానం వచ్చి బాధితులు ఆఫీసులకు వెళ్లగా నిర్వాహకులు పరారైనట్లు తెలిసింది.కష్టపడి సంపాదించిన సొమ్ముతో పాటు వడ్డీలకు అప్పులు తెచ్చి కన్సల్టెన్సీకి ఇచ్చామని, తీరా ఇప్పుడు నడిరోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

మోసానికి ప్రధాన సూత్రధారి అయిన సంస్థ యజమాని సౌజన్య శ్రీనివాస్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని, తమకు న్యాయం చేయాలని పోలీ సులను వేడుకున్నారు. దీంతో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  పరారీలో ఉన్న  సౌజన్య శ్రీనివాస్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు వేగవంతం చేశారు.