28 August, 2026 | 1:24 AM

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి

27-08-2026 11:45 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలోని రెండు డివిజన్ లలో అర్హత ఉన్నవారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని బిజెపి నాయకుడు జకాట ప్రేమ్ దాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు మేడ్చల్ పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.