కేసీఆర్ నిర్ణయంతోనే ఫాక్స్‌కాన్ పెట్టుబడులు
21-05-2026 12:00 AM
- కార్యరూపం దాల్చడం గర్వకారణం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణను ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అప్పటి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఫాక్స్‌కాన్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో ఫాక్స్‌కాన్ పెట్టుబడులు కార్యరూపం దాల్చడం గర్వకారణమ న్నారు.
కేసీఆర్ సమక్షంలో, ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూతో మూడేళ్ల క్రితం కుదిరిన ఒప్పందం ఇప్పుడు కొంగర కలాన్‌లో వేలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరిందన్నారు. తెలంగాణ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు అందించే దిశగా తీసుకున్న పరిశ్రమల విధానం ఇప్పుడు ఫలితాలు ఇస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.






