20 August, 2026 | 2:51 AM

షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్‌ఐలు బదిలీ

20-08-2026 12:00 AM

షాద్‌నగర్, ఆగస్టు 19 (విజయక్రాంతి): డివిజన్‌లో నలుగురు ఎస్సైలు బదిలీ అ య్యారు. ఈమేరకు ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న సుశీల నందిగామ పీఎస్‌కు వెళ్లారు. కొందుర్గు నుంచి రవీందర్ నాయక్ బదిలీపై చేవెళ్లకు వెళ్లారు.

జిల్లేడు చౌదరిగూడ పీఎస్ నుంచి విజయ్.. షాబాద్ పీఎస్‌కు బదిలీపై వెళ్లారు. కేశంపేట ఎస్సై రాజ్ కుమార్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైలు బదిలీ కావడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి షాద్‌నగర్ డివిజన్ వచ్చాక నలుగురు ఎస్సైలు ఒకేసారి బదిలీపై వెళ్లడం ఇదే మొదటిసారి.