20 August, 2026 | 1:55 AM

పొలాల మధ్య బడి..

20-08-2026 12:00 AM

ప్రహరీ లేక కొరవడిన రక్షణ, విష సర్పాల సంచారం..

ఐదు తరగతులు.. 12 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు 

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 19, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పునుకుల పంచాయితీ పరిధిలో గల దేవిజాతండా ప్రాథమిక పాఠశాల పొలాల నడుమ కొనసాగుతోంది. దేవిజాతండా, సూర్య తండకు చెందిన 12 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. 12 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. పొలాల నడుమ పాఠశాల ఉండటంతో విషాసర్పాల సంచారం ఉంటుందని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు.

ప్రహరీ గోడ నిర్మాణానికి పలుమార్లు ప్రతిపాదనలు చేసిన మంజూరు కాకపోవటం గమనార్హం. ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది అనడానికి దేవిజా తండా ప్రాథమిక పాఠశాల ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పటికైనా పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించే విద్యార్థులకు రక్షణ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు.