20 August, 2026 | 3:39 AM

ఫొటోగ్రఫీ ఒక గొప్ప కళ.. మధుర జ్ఞాపకాలను పదిలపరిచే అద్భుత మాధ్యమం

20-08-2026 12:00 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

కొత్తపల్లి, ఆగస్టు 19 (విజయ క్రాంతి): ఫోటోగ్రఫీ ఒక గొప్ప కళ మాత్రమే కాకుండా మధుర జ్ఞాపకాలను పదిలపరిచే అద్భుత మాధ్యమమని, తరతరాలుగా కొనసాగుతున్న ఒక ప్రత్యేకమైన వృత్తి అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ దినపత్రికల ఫోటోగ్రాఫర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రఫీ ద్వారా మధురానుభూతులను, మరపురాని జ్ఞాపకాలను జీవితాంతం పదిలపరుచుకోవచ్చని, సమాజంలో ఎన్నో మంచి మార్పులకు ఫోటోగ్రఫీ దోహదపడుతుందని పేర్కొన్నారు.