calender_icon.png 19 February, 2026 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే రెండేళ్లలో స్మార్ట్ సిటీ ఎలా ఉంటుందో చూపిస్తా

19-02-2026 12:54:41 AM

అన్ని పార్కులను మోడల్‌గా అభివృద్ధి చేస్తాం

పేదవాడి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా 

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ టౌన్, ఫిబ్రవరి 18: రానున్న రెండేళ్లలో నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్, 41 వ డివిజన్ లలో కోటి 30 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనున్న పార్కుల పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాలలో మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని పార్కులన్నీటిని మోడల్ పార్కులుగా తీర్చిదిద్దుతామని, రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్నట్లుగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్, తాగునీటికి అత్యంత ప్రాధన్యత ఇవ్వడం జరుగుతుందని,పట్టణానికి 24 గంటలు మంచినీటి సరఫరా ఉండేలా లతీఫ్ షాబ్ గుట్ట వద్ద ఇదివరకే తాగునీటి సరఫరాకు శంకుస్థాపన చేయడం జరిగిందని , శానిటేషన్ విషయమై పట్టణంలో ఆకస్మిఖ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ తో సహా కార్పొరేటర్లు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.

అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. బొట్టుగూడ మాదిరిగానే మరికొన్ని పాఠశాలలను అభివృద్ధి చేస్తామని, 20 కోట్ల రూపాయలతో చేపట్టిన న్యాక్ భవనం నిర్మాణంలో ఉందన్నారు. ఎస్‌ఎల్ బిసీ సొరంగం లైనింగ్ పనులు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయని, బ్రాహ్మణ వెల్లేముల ద్వారా సాగునీటిని అందిస్తున్నామన్నారు. లతీఫ్ షాబ్ గుట్ట ,బ్రహ్మంగారి గుట్టకు ఘాట్రోడ్ల నిర్మాణం ,ఔటర్ రింగ్ రోడ్డు, 8 సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, పట్టణాన్ని రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తామని వివరించారు.

రాబోయే రెండు సంవత్సరాలలో స్మార్ట్ సిటీ ఎలా ఉంటుందో చూపిస్తామని తెలిపారు. పారిశ్రామికంగా నల్గొండ ను అభివృద్ధి చేసి పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దామని తెలిపారు.సమస్యలను ప్రజలు సమస్యలను మేయర్ లేదా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇకపై నల్గొండ పట్టణం ప్రశాంతతకు మారుపేరుగా ఉండేలా రౌడీయిజం, గంజాయిజల పై ఉక్కు పాదం మోపుతామని , పేదవాడి అభివృద్హే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

ప్రభుత్వ విప్,శాసన సభ్యులు బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్.మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ మహమ్మద్,జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, కార్పొరేటర్లు వేదశ్రీ, సాయి ,కేసాని వేణుగోపాల్ రెడ్డి, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర ,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ పరశురాం, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, స్థానికులు నేతి రఘుపతి, ఏడుదొడ్ల వెంకటరామిరెడ్డి తదితరులు ఉన్నారు.