calender_icon.png 19 February, 2026 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూములు కోల్పోయిన రైతులకు చెక్కుల పంపిణీ

19-02-2026 12:52:54 AM

ఆలేరు, ఫిబ్రవరి 18 :  గంధమల్ల రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కింద చెక్కులను పంపిణీ చేసిన  రాష్ట్ర ప్రభుత్వం విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరం జిల్లా కలెక్టర్ హనుమంత రావు, అదనపు కలెక్టర్ భాస్కరరావు, తో కలసి  412 మంది రైతులకు ఎకరానికి 24 లక్షల 50 వేల చొప్పున 87 ఎకరాలకు  22 కోట్ల 80 లక్షల 58 వేలు గంధ మల్ల బండ్ పోర్షన్ చెక్కులను పంపిణీ చేశాను.

ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ గంధమల్ల రిజర్వాయర్ కోసం రైతులు భూములు ఇవ్వడం వలన ఎనిమిది మండలాలలో 50 వేల ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులు బాధపడకుండా ఉండేందుకు రిజర్వాయర్ కట్టిన తర్వాత ఉపాధి కోసం, వారి కుటుంబాలకు మాత్రమే ఇవ్వడం జరిగిందని అన్నారు.

భూ సేకరణ విషయంలో  రైతుకు ఇంత పెద్ద మొత్తాన్ని ఇప్పించిన ఘనత  కలెక్టర్, అదనపు కలెక్టర్  దే అని కొనియాడారు, జిల్లా కలెక్టర్ హనుమంత రావు మాట్లడుతూ గంధమల్ల రిజర్వాయర్ కోసం భూములు ఇచ్చిన  రైతులకు ఆర్ధిక భరోసా మాత్రమే అని అన్నారు,  ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, ఇరిగేషన్ యస్ ఈ రవీందర్, ఈ ఈ రఘునాధ్ స్పెషల్  డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ,, తుర్కపల్లి  ఎమ్మార్వో జలకుమారి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.