4 April, 2026 | 3:42 AM

మూసీని పూర్తిగా శుద్ధి చేయాలి

04-04-2026 01:53 AM

ఆ తర్వాతే శివుని విగ్రహం ఏర్పాటు చేయాలి

సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ లేఖ

హైదరాబాద్, ఏప్రిల్ 3(విజయక్రాంతి): ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ రాష్ట్ర ప్రభు త్వం మూసీ నది పునరుద్ధరణకు తీసుకున్న నిర్ణయాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ హర్షిస్తుందని సంస్థ అధ్యక్షుడు యం. పద్మనా భరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. అయితే, మూసీ నదిని పూర్తిగా శుద్ధి చేయకముందే ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు వంటి పూజా స్థలాల నిర్మాణాన్ని ప్రారంభించడం సముచితం కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

పలుచోట్ల ఆక్రమణల కారణంగా నగరంలో ప్రవహించే మూసీ నది పెద్ద నాలా లేదా డ్రైనేజీలా మారిపోయింది. తగిన మురుగు నీటి శుద్ధి వ్యవస్థలు లేకపోవడంతో శుద్ధి చేయని మురుగు నీరు నదిలో కి చేరుతూ తీవ్రమైన కాలుష్యాన్ని కలిగిస్తోం ది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం మూసీ నది అత్యంత ప్రాధాన్యత కలిగిన కాలుష్యగ్రస్త ప్రాంతంగా గుర్తించబడింది. అదేవిధం గా 2015లో తెలంగాణ స్టేట్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు కూడా మూసీ నదిని దేశంలోని అత్యంత కాలుష్యగ్రస్త నదుల్లో ఒకటి గా గుర్తించింది.

ఫార్మాస్యూటికల్ కంపెనీలు, ఇతర పరిశ్రమలు శుద్ధి చేయని వ్యర్థాలను నదిలోకి విడుదల చేయడం వల్ల ప్రమాదకర రసాయనాలు, ఔషధ అవశేషాలు నది లో చేరుతున్నాయి. ఈ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన సాధారణ ఎఫ్లువెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఫలితంగా మూ సీ నది తీవ్రమైన పర్యావరణ నష్టాన్ని ఎదుర్కొంటోంది.  ఈ పరిస్థితుల్లో మూసీ నదిని శుద్ధి చేయడం అత్యంత కీలకమైన విషయం.  కాలుష్యంతో నిండిన నది మధ్యలో శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా తగ నది కాదని మేము భావిస్తున్నాం.ఈ విషయాలన్నింటిని పరిగణలోకి తీసుకుని   నది పూ ర్తిగా శుద్ధి చేయబడిన అనంతరం అవసరమైన పూజా స్థలాల నిర్మాణాన్ని చేపట్ట వచ్చు అని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.