విలీన గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి
నూతన డివిజన్ల ఏర్పాటు తథ్యం
వడకపల్లిలో రూ.9.80 కోట్లతో రాక్ పార్క్
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
అమీన్పూర్, ఏప్రిల్ 3: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని వడకపల్లి, కిష్టారెడ్డిపేట, ఐలాపూర్, సుల్తాన్పూర్, దయార, పటేల్ గూడ, ఐలాపూర్ తండా, జానకంపేట గ్రా మాల సర్వతోముఖాభివృద్ధికి ప్రథమ ప్రా ధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవా రం అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇంజనీరింగ్ ఈఈ సురేష్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి లతో కలిసి విలీన గ్రామాలలో ఎ మ్మెల్యే జిఎంఆర్ పర్యటించారు.
ఈ సందర్భంగా పెండింగ్ పనులు, నూతనంగా చేప ట్టబోయే అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎనిమిది గ్రామాల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వడకపల్లి గ్రామంలో గల పురాతన కోటను అభివృద్ధిపరిచేందుకు హెచ్‌ఎండిఏ నిధులు మంజూరు చేసిందని తెలిపారు. 9 కోట్ల 80 లక్షల రూపాయలతో కోట చుట్టూ రాక్ పార్కు అభివృద్ధి చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
పూర్తిస్థా యిలో సర్వే నిర్వహించి.. అతి త్వరలో పా ర్కు నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. సుల్తాన్పూర్ గ్రామంలో మోల్ టెక్ పరిశ్రమ సహకారంతో ఒక కోటి రూపాయలతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చే యబోతున్నట్లు తెలిపారు. సుల్తాన్పూర్ లో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్, మల్ల న్న దేవాలయాన్ని అతి త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యనారాయణ, రా జు, కృష్ణ, పాండు, శ్రీకాంత్, మల్లేష్, భాస్కర్ గౌడ్, మల్లేష్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




