ఘనంగా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ప్రారంభం
జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు నిర్వహణ
కళలు మానసిక ప్రశాంతతనిస్తాయి
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్
హైదరాబాద్, ఏప్రిల్ 3(విజయక్రాంతి): అద్భుతమైన కళాఖండాలు.. మౌనంగా సం భాషిస్తూ ఎన్నో ఊసులు చెప్తున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమే ష్ అన్నారు. మనసుకు ప్రశాంతను ఇచ్చి మరోలోకంలో విహరింపచేసే ఆర్ట్ షోను ప్రతిఒక్కరూ సందర్శించాలని ఆయన సూ చించారు. జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం ఇండియా ఆర్ట్ ఫెస్టివల్‌ను ఆయనప్రారంభించారు. ఈ కళా ప్రదర్శన హైద రాబాద్ నగరంలో కళా స్ఫూర్తిని మరింత ఉత్సాహంగా తీర్చిదిద్దుతుందన్నారు.
కళాభిమానులు, కళాకారులు, క్యూరేటర్, రచయి తలు ఒకే వేదికపై చేరి ఈ మహోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శన, హైదరాబాద్‌లో అతిపెద్ద, చైతన్యభరితమైన కళా సమాహారాల్లో ఒకటిగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందింది అని తూడి దేవేందర్ రెడ్డి (మాజీ అధ్యక్షుడు, జూ బ్లీ హిల్స్ క్లబ్) అన్నారు.
ప్రారంభ రోజునే భారీగా సందర్శకులు హాజరై కార్యక్రమానికి ఉత్సాహాన్ని తెచ్చారు. కలెక్టర్లు, ప్రముఖులు, కళాప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం తో వేదిక సందడిగా మారింది. సుమారు 30 గ్యాలరీల ద్వారా ప్రతినిధ్యం వహిస్తున్న దాదాపు 300 మంది కళాకారుల 3,000కు పైగా కళాఖండాలు ఇక్కడ ప్రదర్శనలో ఉ న్నాయి. చిత్రాలు, శిల్పాలు, మికస్డ్ మీడి యా, ప్రయోగాత్మక కళాఖండాలు వంటి విభిన్న రూపాల్లో భారతీయ సమకాలీన మ రియు సాంప్రదాయ కళా వైవిధ్యాన్ని ఈ ప్ర దర్శన ప్రతిబింబిస్తోంది. ఈ ఫెస్టివల్ ఆదివారం, ఏప్రిల్ 5 వరకు ప్రతిరోజూ ఉద యం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు సం దర్శకులకు అందుబాటులో ఉంటుంది.




