శ్రీపాదరావు ఆశయాలను కొనసాగిస్తాం
మంథనిలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు
మంథని మార్చి2 (విజయక్రాంతి) శ్రీపాదరావు ఆశయాలను కొనసాగిస్తామని మం థనిలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు తెలిపారు. సోమవారం మంథని పట్టణంలోని శ్రీపాదరావు విగ్రహం వద్ద ఆ యన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కలిసి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడు తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ గా తమ తండ్రి శ్రీపాదరావు చేసిన సేవలను గు ర్తు చేసుకుంటూ... తమ కుటుంబం ఈ స్థా యికి ఎదిగేలా ప్రోత్సహించిన మంథని ని యోజక వర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు.
తండ్రి బాటలో అన్న శ్రీధర్ బాబు మంత్రిగా మంథని ని యోజకవర్గానికి కాకుండా తెలంగాణ రాష్ట్రానికి నిరంతరం సేవలు అందిస్తున్నాడని, వా రి బాటలో తాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నా నని, మంథని నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నానని, కాంగ్రెస్ పా ర్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కష్టపడాలని కో రారు. శ్రీపాదరావు ఆశయాలను నెరవేర్చేందుకు నిరంతరం ఇలాగే ప్రజల కోసం పని చేస్తుంటామని శ్రీనుబాబు తెలిపారు.
ఈ కా ర్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మంథని ఏఎంసి చై ర్మన్ కుడుదుల వెంకన్న, మంథని మున్సిప ల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అ ధ్యక్షుడు ఐలి ప్రసాద్, మాజీ మున్సిపల్ చై ర్మన్ పెండ్రు రమాదేవి, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ముసుకుల సురేందర్ రెడ్డి, నాయకు లు శశిభూషణ్ కాచే, మంథని సత్యం, కాం గ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
రామగిరి మండలంలో
రామగిరి మండలంలో మాజీ స్పీకర్ దు ద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘ నంగా నిర్వహించారు. రామయ్యపల్లి బస్ స్టే జ్ వద్ద శ్రీపతి రావు విగ్రహానికి టీపీసీసీ ప్ర ధాన కార్యదర్శి శ్రీనుబాబు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలవేసి ఘనం గా నివాళులర్పించారు. బేగంపేట్ ఎక్స్ రోడ్ వద్ద తొట్ల తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శ్రీనుబాబు పాల్గొని పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రొడ్డ బాబు, సర్పంచులు వనం రామచంద్రరావు, చింత మహేష్, పుల్లెల కొమురయ్య, నాయకులు కాటం సత్యం, బండారి సదానందం, ముత్యాల శ్రీనివాస్, కాంగ్రెస్ నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముత్తారం మండలంలో
ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రా మంలో ఉన్న మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహం వద్ద సోమవారం శ్రీపాద రావు జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీపా దరావు విగ్రహానికి పూలమాలవేసి వారు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బక్కతట్ల వినీత్ యాదవ్, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు బియ్యం శివకుమార్, సర్పంచ్ లు పెగడ తిరుమల కుమార్, రాపల్లి రాజయ్య, మెంగని తిరుపతి, కొట్టే అన్నపూర్ణ ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మహనీయుల జీవితాలు మనకు వ్యక్తిత్వ వికాస పాఠాలు
పెద్దపల్లి, మార్చి 2(విజయక్రాంతి) మ హనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సో మవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్వర్గీయ ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు జ యంతి వేడుకలలో డిసిపి రాంరెడ్డి తో కలిసి పాల్గొన్నారు.దుదిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘ నంగా నివాళులు అర్పించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన ధన్వాడలో పుట్టి శాసనసభ స్పీ కర్ స్థాయికి ఎదిగిన మహనీయులు దుద్దిల శ్రీపాదరావు అని, న్యాయవాదిగా వృత్తి కొ నసాగిస్తున్న సమయంలో ప్రజల ఆకాంక్షల మేరకు రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్ స్థా యి నుంచి శాసనసభ స్పీకర్ స్థాయికి ప్రజ ల ఆశీర్వాదంతో ఎదిగారని, నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తి శ్రీపాద రావు అని అన్నారు.
మహనీయుల జయంతి వేడుకలు నిర్వహించడం ద్వారా వారి జీవితంలోని ముఖ్యంశాల నుంచి మనం వ్యక్తిత్వ వికాస పాఠాలు అనేకం నేర్చుకోవచ్చని అ న్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, జిల్లా యువజన క్రీ డా శాఖ అధికారి సురేష్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




