3 March, 2026 | 2:02 AM

సీపీఆర్‌పై విద్యార్థులకు అవగాహన

03-03-2026 12:06 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 2(విజయక్రాంతి):  జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  సీతారాం ఆధ్వర్యంలో రాష్ట్ర బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారులు డాక్టర్ నరేందర్, డాక్టర్ పూజ, సిబ్బంది విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్పృహ తప్పి కూలిపోయిన వ్యక్తిని చూసిన వెంటనే 108కి సమాచారం ఇవ్వాలని,

స్పందన ఉందో లేదో పలకరించి చూడాలని సూచించారు. స్పందన లేకపోతే నాడి పరిశీలించి, శ్వాసకు ఆటంకం ఉంటే తలని స్వల్పంగా వెనక్కి వంచి గాలి మార్గం సులభం చేయాలని వివరించారు. ఇవన్నీ చేసినప్పటికీ స్పందన రాకపోతే వెంటనే సీపీఆర్ విధానాన్ని పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాతాశిశు సంరక్షణ కోఆర్డినేటర్ వాసుదేవ్ , లెప్రసీ కోఆర్డినేటర్ శ్యామ్లాల్  తదితరులు పాల్గొన్నారు.