క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, మార్చి 2 (విజయక్రాంతి): కారు ణ్య నియామకాలు పొందిన ఉద్యోగులంద రూ క్రమశిక్షణతో తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ అభిలాష అభిన వ్ సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో కారుణ్య నియామకాలు పొందిన 18 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను కలెక్టర్ అందజేశారు. వివిధ కారణాల వల్ల గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఏ స్థాయి ఉద్యోగమైనా బాధ్యతతో, క్రమశిక్షణతో నిర్వహించి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, కలెక్టరేట్ ఏవో స్వాతి, సిబ్బంది పాల్గొన్నారు.




