14 August, 2026 | 5:23 AM

సామాజిక సంక్షేమ బోర్డు మాజీ చైర్‌పర్సన్ సుజాత కన్నుమూత

14-08-2026 12:32 AM

శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (విజయక్రాంతి): ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సామాజిక సంక్షేమ బోర్డు మాజీ చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. శేరిలింగంపల్లి నల్లగండ్లకు చెందిన కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ సతీమణి సుజాత గత కొంతకాలంగా శ్వాస సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలో హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్లో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కుటుంబ వర్గం తెలిపిన ప్రకారం,శుక్రవారం ఉదయం 11 గంటల నుండి వారి నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై, స్థానిక నల్లగండ్ల స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనునట్లు తెలిపారు.