14వ వార్డులో బోనాల పండుగ
వేడుకల్లో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్
ఆయురారోగ్యాలతో, చల్లగా దీవించాలని అమ్మవారిని మొక్కుకున్న మాజీ చైర్పర్సన్
కామారెడ్డి,(విజయక్రాంతి): బోనాల పండుగ మన సంస్కృతిని మరింత బలోపేతం చేస్తాయని కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ అన్నారు. ఆదివారం కామారెడ్డి 14వ వార్డు కాలనీవాసులు బోనాలు పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని పాత ఆర్టీవో కార్యాలయం వద్ద గల మైసమ్మలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీవాసులు, పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండే విధంగా దీవించాలని మైసమ్మ అమ్మవారిని మొక్కుకున్నారు.
కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డులో నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి గడ్డం ఇందుప్రియ పాల్గొన్నారు. అనంతరం గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించే ఇలాంటి పండుగలు మన సంస్కృతిని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.






