18 May, 2026 | 5:21 PM

కైలాస్ టేకిడి ఆలయం వద్ద బిల్వ మొక్కలను నాటిన మాజీ ఎంపీపీ

18-05-2026 04:33 PM

బోథ్,(విజయక్రాంతి): తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కైలాస్ టేకిడి పర్వతంపై కొలువై దీరిన మహాదేవుని దర్శించుకున్న అనంతరం మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆలయం వద్ద విలువ పత్రం మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీదేవి హస్తం నుండి ఉద్భవించిన దివ్యవృక్షం మహా బిల్వా మన్నారు శివునికి ప్రీతిపాత్రమైన బిల్వ వృక్షాలను పెంచి భక్తులకు అందుబాటులో ఉంచాలన్న దృక్పథంతో ఈ మొక్కలను తీసుకురావడం జరిగిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని కడియం నుండి వీటిని తీసుకువచ్చి నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అల్లకొండ పోతన భద్రతాండ సర్పంచ్ రూప్ చంద్ విజయ్ కుమార్ సాయి సాగర్ లు ఉన్నారు