25 July, 2026 | 5:24 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర

25-07-2026 04:19 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): ఆషాడ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య  దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యని కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.