25 July, 2026 | 4:54 PM

లక్ష్మి బ్యారేజ్ కు పేరుడుతున్న వరద

25-07-2026 04:19 PM

పలిమెల,జులై 25,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మి )బ్యారేజ్ కి వరద ప్రవాహం పెరుగుతుంది.ఎగువన కురుస్తున్న వర్షాలకు  మహారాష్ట్ర లో ప్రాణహిత నది , గోదావరి నదికి వరద తాకిడి రావడంతో త్రివేణి సంఘమం కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్ ను తాకుతూ గోదావరి నది ప్రవహిస్తుంది.దిగువన  మేడిగడ్డ (లక్ష్మి ) బ్యారేజ్ 16.17టి ఎం సి ల సమర్థ్యనికి బ్యారేజ్ లోకి లక్షా 15వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం రాగ బ్యారేజ్ 85గేట్లు ఎత్తి అదే లెవల్లో దిగువకు విడుదల చేస్తున్నారు.