అభివృద్ధి పనులకు నిధులు మంజూరు
25-07-2026 04:51 PM
భైంసా,(విజయక్రాంతి): బైంసా డివిజన్లోని లింబాబి గ్రామ అభివృద్ధి పనులకు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ 1.80 కోట్ల నిధులను మంజూరు చేశారు. గ్రామంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులను మంజూరు చేస్తూ మంజూరు పత్రాన్ని గ్రామస్తులకు అందించారు. గ్రామానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు వీడి సభ్యులు ఉన్నారు.






