హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డికి వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్వాగతం పలికారు. పూల మొక్కను అందజేసి న్యాయమూర్తులను అభినందించారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో శని, ఆది, రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మాధవీ లతలకు జిల్లా కలెక్టర్ పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు శనివారం, ఆదివారం రెండు రోజులపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. న్యాయమూర్తులకు స్థానిక పోలీసులు ఆర్ అండ్ బి అతిథి గృహంలో పోలీస్ గౌరవ వందనాన్ని చేశారు.






