టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం
నేరేడుచర్ల,(విజయ క్రాంతి): గిరిజన పారిశ్రామికవేత్తల అభివృద్ధి, సాధికారత మరియు వారి విజయగాథలను సమాజానికి చేరవేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (టిఐసిసిఐ) సంస్థ, రాష్ట్ర మీడియా & సాంస్కృతిక విభాగానికి రామావత్ నాగేంద్ర నాయక్ ని స్టేట్ కో ఆర్డినేటర్ – మీడియా & కల్చర్ వింగ్ గా నియమించింది. నూతన బాధ్యతలు స్వీకరించిన రామావత్ నాగేంద్ర నాయక్ మాట్లాడుతూ... టిఐసిసిఐ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని గిరిజన కళాకారులు, గాయకులు, రచయితలు, మీడియా ప్రతినిధులు మరియు యువ ప్రతిభను ఒక వేదికపైకి తీసుకువచ్చి, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, పారిశ్రామిక అవకాశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ నియామకo పట్ల పలువురు టిఐసిసిఐ నాయకులు, సభ్యులు మరియు గిరిజన సంఘాల ప్రతినిధులకు హర్షం వ్యక్తం చేస్తూ రామావత్ నాగేంద్ర నాయక్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.






