సీసీ రోడ్లను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి
మనోహరాబాద్, మే 20: మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్, తూప్రాన్ మండలం కిష్టాపూర్ లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల ద్వారా నూతన సిసి రోడ్లు నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం శుభ సూచకమని గ్రామాలలో నెలకొన్న ప్రతి సమస్యను తీర్చుట గాను కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు.
గ్రామానికి కావలసిన అన్ని రకాల డ్రైనేజీలు, సిసి రోడ్లు మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయుటకు కృషి చేస్తుందన్నారు. ఇందులో తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్మన్ యాంజాల కీర్తన విటల్ రెడ్డి, వైస్ చైర్మన్ మామిళ్ళ కృష్ణ, డైరెక్టర్లు, నాయకులు సత్య నారాయణ గౌడ్, పురం రవి, శ్రీశైలం యాదవ్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.






