ప్రజల్లోనే నిమగ్నమైన రాములన్న
చీమలపాడు ప్రాంతంలో విస్తృత పర్యటన
పలు కుటుంబాలను పరామర్శించిన మాజి ఎమ్మెల్యే రాములు నాయక్
సొసైటీ డైరెక్టర్, ఆర్ఎంపి రమేష్ తండ్రి దశదిన కర్మకు హాజరు
కారేపల్లి,(విజయక్రాంతి): వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ మండల పరిధిలోని చీమలపాడు, పాటిమీద గుంపు గ్రామాల్లో విస్తృతంగా బుధవారం పర్యటించారు. రాములు నాయక్ గారికి ప్రజలు స్వాగతం పలికారు. ప్రజల్లోనే నిమగ్నమైన రాములు నాయక్ భవిష్యత్తులో నేను మీకు అండగా ఉంటానని వారికీ భరోసా ఇచ్చారు. దీంతో పలు గ్రామాల్లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యేకు వివిధ పార్టీల నాయకులు కలిసి సార్ మళ్లీ మీరే రావాలి అంటూ తెలిపారు.
పాటిమీద గుంపు గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్ ఆర్.ఎం.పి పోతురాజు రమేష్ తండ్రి పోతురాజు కృష్ణయ్య దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. అంతకు ముందు చీమలపాడు గ్రామానికి చెందిన పాటి కోటయ్య అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల మరణించిన బసవ రాంబాబు చిత్ర పటానికి నివాళులుర్పించి వారి కుటుంబ సభ్యులును ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంట వైరా మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, గ్రామీణ వైద్యుల సంక్షేమ జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరపు వెంకటచారి, సొసైటీ వైస్ చైర్మన్ సర్పంచ్ ధారావత్ మంగీలాల్, మాజీ ఎంపీటీసీ ధరంసొత్ శంకర్, మాజీ సర్పంచ్ లు మాలోత్ కిషోర్, బానోత్ శంకర్, మౌనిక, రాంజీ, మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మిర వీరన్న, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాంకుడోత్ నరేష్, నాయకులు పాటి శ్రీను, తదితరులున్నారు.






